సాయి ధరమ్ తేజ్ కు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఎన్ని పాయింట్లు వచ్చాయంటే..!

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పోలీసులు పలు చోట్ల డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. వీకెండ్ కావడంతో చాలా మంది అడ్డంగా దొరికిపోయారు. అయితే పోలీసులు చెకింగ్ చేసే సమయానికి యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా అక్కడికి వచ్చారు. పోలీసులు సాయి ధరమ్ తేజ్ కు కూడా బ్రీత్ అనలైజర్ టెస్టును నిర్వహించారు. అయితే ఈ టెస్టులో సాయి ధరమ్ తేజ్ ‘0’ పాయింట్లు మాత్రమే వచ్చాయి. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ మద్యపానానికి వ్యతిరేకంగా పలు క్యాంపెయిన్ లలో పాల్గొన్నాడు.. అలాగే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించాడు. నిజ జీవితంలో కూడా తాను అలాంటి వాడినేనని నిరూపించుకున్నాడు. టెస్టు పూర్తయ్యాక తేజును అక్కడి నుండి పంపించేశారు.


గత రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పలువురు మందు బాబులు అడ్డంగా బుక్కయ్యారు. 22 కార్లు, 29 బైకులు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. ఫుల్ గా మద్యం తాగిన ఓ మహిళ తన కారును ఇవ్వాలంటూ ప్రాధేయపడినా పోలీసులు కరుణించలేదు. ఆమె కారును సీజ్ చేసి, డ్రంకెన్ డ్రైవ్ కేసు పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here