అయ్యో.. డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన సాయి కుమార్..!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతాపార్టీ ముందుకు దూసుకుపోతున్నప్పటికీ బాగేపల్లిలో బీజేపీ అభ్యర్థి అయిన ప్రముఖ నటుడు సాయి కుమార్ ఓటమి పాలయ్యాడు. కనీసం ఆయన డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాడు.

బాగేపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన ఆయనను అక్కడి ఓటర్లు తిరస్కరించారు. కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి చేతిలో ఆయన చిత్తుగా ఓడిపోయారు. సాయికుమార్ కు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.. ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. తెలుగు ప్రజల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో బాగేపల్లి కూడా ఒకటి.. అందుకే అక్కడ బీజేపీని తిరస్కరించినట్లు తెలుస్తోంది. 2008 ఎన్నికల్లో సైతం ఇదే స్థానం నుంచి సాయికుమార్ ఓటమిపాలయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here