తనపై వస్తున్న పుకార్లపై స్పందించిన సాయి పల్లవి.. అలాంటి వాటికి నా తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు..!

గత కొద్ది రోజులుగా మీడియాలో హీరోయిన్ సాయి పల్లవిపై వరుస కథనాలు వస్తున్నాయి.. చాలా వాటిలో క్లారిటీ లేవు కూడా..! ఎక్కువ కండీషన్లు పెడుతోందని.. హీరో కంటే డామినేషన్ ఎక్కువైందని ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ పుకార్లపై స్పందించింది సాయి పల్లవి. దిల్ రాజుతో మరో సినిమాను ఒప్పుకోకపోవడంపైనా.. గ్లామర్ క్యారెక్టర్ల పైనా స్పందించింది ఈ ఫిదా భామ.

గ్లామర్ పేరుతో అందాల ఆరబోతకు తాను విరుద్ధమని.. స్కిన్ షోను కొందరు గ్లామర్ అనుకుంటారని.. అదే భావనతో తన వద్దకు కొందరు వచ్చారని.. వారితో సినిమాలను తాను తిరస్కరించానని ఆమె తెలిపింది. తన దగ్గరకు వచ్చే కొంత మంది కథ గురించి ఏమీ చెప్పరని… ఫలానా హీరో పక్కన నటిస్తారా అంటూ నేరుగా అడుగుతారని తెలిపింది. తన దృష్టిలో కథనే హీరో అని, మిగిలినవారంతా కేవలం యాక్టర్స్ మాత్రమేనని చెప్పింది. లిప్ లాక్స్ లాంటివి తనవల్ల కాదని అలాంటి వాటికి తన తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరని తెలిపింది.

తనకు నచ్చితేనే సినిమా చేస్తానని… నచ్చకపోతే ఎవరు బలవంతం చేసినా చేయనని కూడా సాయి పల్లవి తేల్చి చెప్పింది. దిల్ రాజు సినిమా కథ తనకు నచ్చలేదని.. తనకు తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని కొందరు, చాలా ఎక్కువ ఆఫర్ చేసినా తిరస్కరించానని మరికొందరు… ఇలా ఎవరికి తోచినట్టు వారు ప్రచారం చేస్తున్నారని… ఎవరేమనుకున్నా తనకు అనవసరమని, కథ నచ్చకపోతే సినిమా చేయనని స్పష్టం చేసింది. సాధారణంగా దిల్ రాజు సినిమాలంటే కథాబలం ఉన్నవి.. ఫెయిల్యూర్ శాతం చాలా తక్కువ.. అలాంటిది కథ నచ్చలేదని సాయి పల్లవి ఓపెన్ అయిపోవడం నిజంగా ధైర్యమైన పనే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here