శైలజారెడ్డి అల్లుడు ప్రీ రిలీజ్ బిజినెస్ – వినాయ‌క చ‌వితికి విడుద‌ల‌

అక్కినేని నాగ చైతన్య నటించి శైలజారెడ్డి అల్లుడు చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా యంగ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ నటించింది. రమ్యకృష్ణ అత్త పాత్రలో నటించిన ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తిని నెలకొని ఉంది. దర్శకుడు మారుతి వినోదాత్మక అంశాలతో ఈ చిత్రాన్ని తెరక్కించాడు. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురువారం రోజు వినాయక చవితి కానుకగా భారీ విడుదలకు రంగం సిద్ధం అయింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిద్దాం.

పాజిటివ్ బజ్‌తో విడుదలకు: శైలజారెడ్డి అల్లుడు పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని పాజిటివ్ అంశాలతో ఈ చిత్రం విడుదల కాబోతోంది. నాగ చైతన్య కెరీర్ భారీ అంచనాలతో విడుదలవుతున్న చిత్రం ఇదే అని చెప్పొచ్చు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగింది.

చైతన్య ముందు బిగ్ టాస్క్: ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 25 కోట్లవరకు జరిగింది. నాగ చైతన్య కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ నంబర్ అని చెప్పొచ్చు. కొన్ని ఏరియాలలో ఊహించిన మొత్తం కంటే ఎక్కువగా బిజినెస్ జరిగింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావాలంటే 30 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here