భాయ్ కి బెయిల్ వచ్చేసిందోచ్..!

సల్మాన్ ఖాన్ కు బెయిల్ వచ్చేసింది. జోధ్‌పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ ను 50000 రూపాయల పూచీకత్తు మీద బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు వెలువరించింది. ఈ రోజు సాయంత్రం సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైలు నుండి విడుదల కాబోతున్నాడు. ఉదయమే బెయిల్ కు సంబంధించిన వాదోపవాదాలు పూర్తయ్యాయి. మధాహ్నం 2 గంటలకు బెయిల్ కు సంబంధించిన తీర్పు వెల్లడికానుండగా కొన్ని కారణాల వలన తీర్పు ఆలస్యం అయింది. సల్మాన్ కు బెయిల్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణ జింకల వేట కేసులో న్యాయస్థానం గురువారం సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆ వెంటనే ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం బెయిలుపై విచారణ జరిపిన కోర్టు దానిని శనివారానికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్‌ను విచారిస్తున్న డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషీ బదిలీ అయ్యారని వార్తలు రావడంతో ఈ రోజు కూడా సల్మాన్ ఖాన్ జైలులోనే ఉంటారని అనుకున్నారు.. కానీ ఆయన ఈరోజు విధులు నిర్వర్తించడంతో సల్మాన్ బెయిల్ పిటీషన్ పై విచారణ జరిగి.. బెయిల్ వచ్చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here