దీనావస్థలో ఉన్న తన సినిమా హీరోయిన్ ను ఆదుకోడానికి ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్..!

తన సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజ దడ్వాల్‌ని ఆదుకుంటానని బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తెలిపారు. 1995లో విడుదలయిన వీర్ గతి చిత్రంలో ఆమె సల్మాన్ సహ నటిగా నటించింది. అందులో అతుల్ అగ్నిహోత్రికి జంటగా ఆమె యాక్ట్ చేసింది. ఆమె తన దయనీయ పరిస్థితి గురించి మీడియా ముఖంగా తెలిపింది. క్షయ వ్యాధితో బాధపడుతున్న ఆమె దగ్గర ఒక్క రూపాయి కూడా లేని దీనావస్థలో ఉంది.

పూణేలో సల్మాన్ చేపట్టిన ‘దబాంగ్’ టూర్ సందర్భంగా అతని వద్ద పూజా పరిస్థితిని మీడియా ప్రస్తావించినప్పుడు, “పూజ గురించి నాకు ఇప్పుడే తెలిసింది. ఆమె ఇలాంటి దుస్థితిలో ఉందని నాకు ఇప్పటివరకు తెలియదు. ఆమెకు చేయగలిగినంత సాయం చేస్తాం. ఆమె కోలుకుంటుందని ఆశిస్తున్నాను” అని సల్మాన్ చెప్పాడు. పూజ ప్రస్తుతం ముంబైలోని టీఆర్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.దీనిపై తొలుత స్పందించిన బోజ్‌పురి స్టార్ రేసు గుర్రం విలన్ రవి కిషన్ ఆమెకు తనవంతు సాయం చేశాడు. 1997లో విడుదలయిన ‘తుమ్ సే ప్యార్ హో గయా’ చిత్రంలో ఆమె రవికిషన్‌తో కలిసి నటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here