జైల్లో సల్మాన్ భాయ్ రాత్రి గడిచింది ఇలా.. ఈరోజైనా బెయిల్ వచ్చేనా..!

కృష్ణ జింకల కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్ ప్రస్తుతం జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. సల్మాన్ భాయ్ కు ఈరోజు బెయిల్ వస్తుందని అందరూ భావిస్తూ ఉన్నారు. సల్మాన్ కూడా అదే ఆశతో రాత్రంగా గడిపాడట..! అలాగే సల్మాన్ కు ఎటువంటి వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వలేదని.. సాధారణ ఖైదీ లాగే చూసుకున్నామని జైలు అధికారులు చెబుతున్నారు.

జైలులో అతడికి ఓ చెక్కమంచం, నాలుగు దుప్పట్లను అధికారులు అందించారు. రాత్రి ఆయన ఆ మంచంపైనే నిద్రించినట్టు అధికారులు తెలిపారు. జైలుకు చేరుకున్న సల్మాన్‌కు ఆయన మేనేజర్ హోటల్ తాజ్ నుంచి ఆహారం, దుస్తులు తెచ్చి ఇచ్చినట్టు వచ్చిన వార్తలను జైలు సూపరింటెండెంట్ విక్రమ్ సింగ్ కొట్టిపడేశారు. అతడు వాటిని తెచ్చిన మాట వాస్తవమే అయినా దుస్తులు మాత్రమే తీసుకున్నామన్నారు. జైలులో సల్మాన్‌కు ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదని తేల్చి చెప్పారు. జైలుకు వచ్చినప్పుడు అతడికి రక్తపోటు ఉందని, ప్రస్తుతం అది సాధారణ స్థాయికి చేరుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి సల్మాన్ నీళ్లు తప్ప ఏమీ తీసుకోవడం లేదని విక్రమ్ సింగ్ తెలిపారు. జైలు మెనూ ప్రకారం రాత్రికి భోజనంలోకి చనా పప్పు, క్యాబేజీ అందించినట్టు చెప్పారు. ఈ ఉదయం అందరితో పాటు బ్రేక్‌ఫాస్ట్, టీ, తర్వాత కిచిడీ ఇవ్వనున్నట్టు చెప్పారు.

1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో 20 ఏళ్ల తర్వాత జోధ్‌పూర్ కోర్టు సల్మాన్‌ను గురువారం దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటులు సైఫ్ అలీఖాన్, టబు నీలమ్, సోనాలి బింద్రేలు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలిపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here