సల్మాన్ ఖాన్ ‘రేస్-3’ ట్రైలర్..!

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న రేస్-3 ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే రేస్, రేస్-2 చిత్రాలు ఘన విజయం సాధించగా.. ఇక మూడో భాగం ఏ రేంజి హిట్ సాధిస్తుందో చూడాలి. తొలి రెండు భాగాలలో సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించగా.. రేస్-3 లో సల్మాన్ అడుగుపెట్టాడు.

సాధారణంగా కుటుంబంలో ఆస్థుల కోసం వేసే ప్లాన్ లు.. భారీ యాక్షన్ సీన్లు రేస్ ఫ్రాంచైజీలో ఉంటాయి. ఇక మూడో యాక్షన్ ఎంటర్ టైనర్ ను మరింత భారీగా రూపొందించారు. ట్రైలర్ లో మచ్చుకు కొన్ని మాత్రమే మన ముందుకు వదిలినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో స్టార్ లకు ఏ మాత్రం కొదవే లేదు. బాబీ డియోల్, అనీల్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసీ షా, సకీబ్ సలీమ్ లు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి రెమో డిసౌజా దర్శకత్వం వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here