పాపం సల్మాన్ ఖాన్ హీరోయిన్ ఎలాంటి స్థితిలో ఉందో..!

సినిమా స్టార్స్ అందరి జీవితాలూ ఒకేలా ఉంటాయని అనుకుంటే.. అది పొరపాటే..! ఒకప్పుడు రాజభోగాలు అనుభవించిన వాళ్ళు.. కెరీర్ చివర్లో ఎన్నో అవస్థలు పడ్డారు. ఈ విషయం ఎంతో మంది సినీ యాక్టర్ల జీవితాల గురించి తెలిస్తే ఇట్టే అర్థం అయిపోతుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో హీరోయిన్ గా చేసిన ఆమెకు చాలా కష్టం వచ్చింది. కనీసం ఆసుపత్రిలో చికిత్స చేయించుకోడానికి కూడా ఆమె వద్ద డబ్బులు లేవు..!

 

సల్మాన్ ఖాన్‌ హీరోగా 1995లో రిలీజైన ‘వీర్‌గతి’ చిత్రంలో హీరోయిన్ పూజా దడ్వాల్‌ నటించింది. ఆ సినిమాలో అతుల్ అగ్నిహోత్రి కూడా మరో హీరోగా చేశాడు. ఇప్పుడామె దయనీయ స్థితిలో ఉంది. తనకు టీబీ సోకిందని ఆరు నెలల కిందట వైద్యులు నిర్థారించారని, ఈ విషయం తెలియగానే తన భర్త, కుటుంబం తనను వదిలేశారట..! గత పదిహేను రోజులుగా ముంబైలోని సెవ్రీలో ఉన్న టీబీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. అయితే ఒంటరిగా ఉన్న తనను ఆదుకునే వారు ఎవరూ లేరని బాధపడింది. చికిత్స చేయించుకునే స్తోమత కూడా తనకు లేదని, కనీసం ఓ కప్పు టీకి కూడా ఇతరులపై ఆధారపడుతున్నానని ఆమె తన దయనీయ స్థితి గురించి వివరించింది. తన బాధ గురించి తెలిస్తే సల్మాన్ ఖాన్ సాయం చేస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here