దటీజ్ సమంత.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తేల్చి చెప్పిన కేటీఆర్..!

సాధారణంగా తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ఏదైనా కానీ కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంటారు. సోషల్ మీడియాలో కూడా ఎవరైనా ఏదైనా విమర్శలు చేస్తే అందుకు తగ్గ సమాధానం వెంటనే వచ్చేస్తూ ఉంటుంది. అయితే తెలంగాణలో చేనేతను అసలు పట్టించుకోలేదని.. సమంతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి డబ్బులు అయితే ఇస్తారు కానీ.. నేతన్నలను ఆదుకోవడం లేదని విమర్శించారు. అయితే దీనిపై కేటీఆర్ స్పందించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చేనేతకు స్వర్ణ యుగం వచ్చిందని.. అంతేకాకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సమంత తెలంగాణ చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోందని శాసనమండలిలో చేనేతపై మాట్లాడుతూ కేటీఆర్ సమాధానం ఇచ్చారు.


తెలంగాణలో చేనేతకు స్వర్ణ యుగం వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక్కడ నెలకొన్న కష్టాలతో దశాబ్దాల కాలంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు తెలంగాణ చేనేత కార్మికులు వలస వెళ్లారని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తెలంగాణకు చెందిన చేనేత కార్మికులు ఉన్నారని చెప్పారు. స్వాతంత్ర్యం తర్వాత ఎందరో నాయకులు వచ్చారని, పోయారని… అయినా చేనేత కార్మికుల జీవితాలు మాత్రం మారలేదని అన్నారు. తమది చేనేతల చేతల సర్కారు అని చెప్పారు. చేనేత రుణమాఫీని పక్కాగా ప్లాన్ చేసి, అమలు చేస్తున్నామని తెలిపారు. చేనేత రంగానికి కేంద్రం నుంచి సహకారం లేకున్నప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here