మిగతా ప్రపంచమంతా క్లీనా.. సమ్మోహనం టీజర్..!

ఇంద్రగంటి మోహన్ కృష్ణ.. మంచి సినిమాలు తీస్తాడని ప్రతి ఒక్కరికీ తెలిసిందే..! ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సమ్మోహనం’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఆకట్టుకుంటోంది. సినిమాలంటేనే పడని మన హీరోకు.. సినిమా హీరోయిన్ కు మధ్య నడిచే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకిక్కించారు.

ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా సుధీర్ బాబు, అదితీరావ్ హైదరీ నటించారు. ఈ చిత్ర టీజర్ లో ముఖ్యంగా విజువల్స్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎంతో గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. శ్రీ‌దేవి మూవీస్ బ్యాన‌ర్‌పై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతం, పీజీ విందా ఫొటోగ్ర‌ఫీ ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్స్‌. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా టీజ‌ర్‌ను ఆవిష్క‌రించ‌కముందే త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. “సమ్మోహనం అనే టైటిల్ ఎంత ఆకర్షణీయంగా ఉందో .. అదే విధంగా ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకర్షించుకుని వాళ్లను సమ్మోహితులను చేస్తుంది అనడంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు. ఇదొక చక్కని లవ్ స్టోరీ .. సుధీర్ బాబుకి ఒక సూపర్ డూపర్ హిట్ ను ఈ సినిమా అందించాలని మనసారా కోరుకుంటున్నాను” అంటూ ఈ సినిమా టీమ్ కి చిరంజీవి శుభాకాంక్షలు అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here