స్టార్ హీరోల గ్రూప్ ఫొటో..ప‌క్క‌న ల్యాంబోర్గిని

ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్‌. శాండ‌ల్‌వుడ్‌లో టాప్ హీరో. మొన్నీమ‌ధ్యే ఆయ‌న అత్యంత ఖ‌రీదైన‌, విలాసవంత‌మైన ల్యాంబోర్గిని కారు కొన్నారు.

నిజానికి.. ల్యాంబోర్గిని కారు క‌న్న‌డ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టిదాకా ఎవ‌రి వ‌ద్దా లేదు. అందుకే.. ద‌ర్శ‌న్ తోటి హీరోలు, న‌టులు ఆ కారును చూడ్డానికి ఆయ‌న ఇంటికి క్యూ క‌ట్టారు.

యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, ఆయ‌న సోద‌రి కుమారుడు, క‌న్న‌డ హీరో చిరంజీవి స‌ర్జా, డైన‌మిక్ ప్రిన్స్ ప్ర‌జ్వ‌ల్ దేవ‌రాజ్‌, నిర్మాత ఎంజీ రామ్మూర్తి, న‌టుడు, ద‌ర్శ‌కుడు త‌రుణ్ సుధీర్‌, యువ‌న‌టుడు య‌శ‌స్ సూర్య ద‌ర్శ‌న్ ఇంటికి వెళ్లి మ‌రీ.. ల్యాంబోర్గిని కారును చూశారు.

సంక్రాంతి పండుగ నాడు ద‌ర్శ‌న్ ఈ కారును కొన్నాడు. అనంత‌రం ప్ర‌ఖ్యాత మైసూరులోని చాముండేశ్వ‌రి ఆల‌యంలో పూజ‌లు చేయించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here