జీవిత రాజశేఖర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సామాజిక కార్యకర్త సంధ్య..!

గత కొద్ది రోజులుగా జీవిత.. ఆమె భర్త రాజశేఖర్ మీద తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సైలెంట్ గా ఉంటే కుదరదు అని అనుకున్నారో ఏమో కానీ.. జీవిత నిన్న ప్రెస్ మీట్ పెట్టి అందరినీ కడిగేసింది. ఏమి తెలుసు మాగురించి మీకు అని ఆరోపణలు చేసిన వాళ్ళపై ఫైర్ అయ్యారు. అక్కడితో ఆగకుండా కొందరి పైన కేసులు పెడతామని కూడా చెప్పారు. వారిలో సామాజిక కార్యకర్త సంధ్య కూడా ఉన్నారు. దీనిపై ఆమె స్పందించారు.

సంధ్య స్పందిస్తూ, తాను చేసిన వ్యాఖ్యలకు తగిన ఆధారాలు ఉన్నాయని, బాధిత యువతులే తన దగ్గరకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. ఇంకా చాలా విషయాలు చెప్పారని, అవన్నీ చెబితే చాలా అసహ్యంగా ఉంటుందని అన్నారు. ఇది కేవలం జీవితకు, తనకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదని చెప్పిన సంధ్య, సినీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ లేదని, కమిట్ మెంట్ సిస్టమ్ లేదని జీవిత మాట్లాడటం కరెక్టు కాదనే దృష్టితోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, జీవిత అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తనపైన, తన కుటుంబంపైన అసత్య ఆరోపణలను చేశారంటూ సామాజిక కార్యకర్త సంధ్యపైన, వాటిని ప్రసారం చేసిన ప్రముఖ న్యూస్‌ ఛానల్‌పైన కేసులు పెట్టనున్నట్లు జీవిత తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here