అందరికి నచ్చిన సంజీవని 

మనోజ్‌చంద్ర, అనురాగ్‌ దేవ్‌, శ్వేత వర్మ, తనూజ, అమోగ్‌, నితిన్‌, మోహన్‌ ప్రధాన పాత్రధారులుగా రవి వీడే దర్శకత్వంలో నివాస్‌ క్రియేషన్స్‌ పతాకంపై జి.నివాస్‌ నిర్మించిన చిత్రం ‘సంజీవని’. ఇటీవల విడుదలైన సినిమాకు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో మంగళవారం సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రవి వీడే మాట్లాడుతూ, ‘సినిమాకు విశేష స్పందన లభిస్తుంది. 87థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు వందకుపైగా థియేటర్లలో ఆడుతోంది. థియేటర్లు పెరగడమే మా చిత్ర విజయానికి ఉదాహరణ. జూన్‌ 29న విడుదలైన సినిమాల్లో థియేటర్లు పెరిగిన ఏకైక సినిమా మాది. చూసిన వారంతా హాలీవుడ్‌ తరహాలో ఉందంటూ ప్రశంసిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి సినిమా తీయడం అసాధ్యం. కానీ మేం దాన్ని చేసి చూపించాం. ఓపెనింగ్‌ ఎపిసోడ్‌ను కేవలం 15 లక్షల్లో పూర్తి చేశాం. అలా ఎవరూ తీయలేరు. ఇలాంటి చిత్రాలకు ఇదొక ట్రైలర్‌ లాంటిది. మా చిత్ర ట్రైలర్‌ చూసి రాజమౌళి, రామ్‌గోపాల్‌వర్మ వంటి దర్శకులు ట్వీట్‌ ద్వారా ప్రశంసించారు. సినిమాపై హైప్‌ను పెంచారు. వారికి థ్యాంక్స్‌. మా ప్రయత్నాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆడియెన్స్‌ కోసం ఓపెనింగ్‌ ఎపిసోడ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నాం’ అని అన్నారు. ‘మూడు రోజుల్లోనే కోటి 25 లక్షలను వసూలు చేసింది. మరో నాలుగు వారాలు సినిమా ఆడుతుందని నమ్ముతున్నాం’ అని బాపినీడు తెలిపారు. హీరో అనురాగ్‌ చెబుతూ, ‘అందరూ కొత్తవాళ్ళతో సినిమా తీయడం రిస్క్‌. అయినా మాతో సినిమా చేసిన దర్శకుడు రవివీడే, నిర్మాత నివాస్‌కు థ్యాంక్స్‌. సినిమా క్లైమాక్స్‌ అద్భుతంగా ఉందంటున్నారు. హాలీవుడ్‌ తరహాలో మనం కూడా సినిమా చేయగలమనడానికిది నిదర్శనం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మనోజ్‌ చంద్ర, శ్వేత వర్మ, మోహన్‌, పూర్నేష్‌, ఆనంద్‌ విరించి తదితరులు పాల్గొని చిత్ర విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here