ఆకట్టుకుంటున్న ‘సంజీవని’ ట్రైలర్.. టాలీవుడ్ లో సరికొత్త అడ్వెంచరస్ చిత్రం..!

‘సంజీవని’.. ఈ చిత్ర ట్రైలర్ చూసి టాలీవుడ్ జనాలు మెచ్చుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మన తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ జానర్ లో సినిమాలు వస్తూ ఉంటాయి.. కానీ అడ్వెంచరస్ ఫిలిమ్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఆ లోటును తీర్చడానికి ఈ చిత్రం వస్తోంది. తమకున్న బడ్జెట్ లో చాలా బాగా తీశారు.

జి.నివాస్‌ నిర్మాతగా, రవీ వీడే దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అమొఘ్ దేశపతి, మనోజ్‌ చంద్ర, అనురాగ్‌ దేవ్‌, శ్వేత ముఖ్యపాత్రధారులు. హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుల సహకారంతో దాదాపు రెండు స్వత్సరాల పాటు పనిచేసి మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాజీతో తీశారు. వెయ్యికి పైగా విఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉన్నాయని చిత్ర బృందం తెలిపింది. సంజీవని అంటే ప్రతి ఒక్కరికీ తెలిసిందే.. హనుమంతుడు దాన్ని తీసుకొని వచ్చి లక్ష్మణుడి ప్రాణాలను నిలబెట్టాడు. ఆ సంజీవనిని తీసుకొని రావడానికి స్నేహితుల బృందం చేసే ప్రయత్నమే ఈ సంజీవని. అతి త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here