మన మరో బంగారం.. కామన్ వెల్త్ గేమ్స్ లో..!

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల పోటీల్లో భారత్ కు మరో స్వర్ణం దక్కింది. ఈరోజు కూడా స్వర్ణం వెయిట్ లిఫ్టింగ్ లోనే దక్కడం విశేషం. సంజిత చానూ 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఏకంగా 192 కేజీల బరువును ఎత్తింది. స్నాచ్ రౌండ్ లో మూడు అటెంప్ట్ లలో విజయం సాధించిన ఆమె, క్లీన్ అండ్ జర్క్ విభాగం మూడో అటెంప్ట్ లో విఫలమైనప్పటికీ, పపువా న్యూ గినియా వెయిట్ లిఫ్టర్ సైతం క్లీన్ అండ్ జర్క్ థర్డ్ అటెంప్ట్ లో ఫెయిల్ కావడంతో స్వర్ణ పతకం భారత్ కైవసమైంది. మొదటి రోజు మీరాబాయి చానూ స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే.

https://twitter.com/sachin_rt/status/982124798032531457

https://twitter.com/SirrrJadeja/status/982107605517516800

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here