సౌదీ అరేబియా చ‌రిత్ర‌లోనే మొట్ట‌మొద‌టిసారిగా అర‌బ్ ఫ్యాష‌న్ వీక్‌..! ఎప్పుడంటే?

న్యూఢిల్లీ: ప‌క్కా మ‌త‌త‌త్వ దేశంగా ఇన్నాళ్లూ ముద్ర‌ప‌డిన సౌదీ అరేబియా క్ర‌మంగా త‌న వైఖ‌రిని మార్చుకుంటోంది. మ‌హిళ‌ల‌కు డ్రైవింగ్ హ‌క్కుపై విధించిన నిషేధాన్ని ఎత్తేసిన త‌రువాత ఆ దేశం.. అన్ని రంగాల్లోనూ మ‌హిళ‌ల‌కు స‌మాన ప్రాతినిథ్యం ఇవ్వడానికి ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

తాజాగా.. ఫ్యాష‌న్ ప్ర‌పంచం వైపూ చూపులు సారించింది. సౌదీ అరేబియా చ‌రిత్ర‌లోనే ఎప్పుడూ లేని విధంగా అక్కడ `అరబ్‌ ఫ్యాషన్‌ వీక్‌`ను నిర్వహిస్తున్నారు.

సౌదీ రాజధాని రియాద్‌లో వ‌చ్చేనెల 26 నుంచి 31 వరకు ఈ ఈవెంట్ ఏర్పాటు కాబోతోంది. దీనివ‌ల్ల ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత ఆక‌ర్షించ‌డంతో పాటు.. మ‌హిళ‌ల‌కు స‌మాన సాధికార‌త‌ను కల్పించిన‌ట్ట‌వుతుంద‌ని భావిస్తోంది సౌదీ ప్ర‌భుత్వం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here