ఏప్రిల్ 18..సౌదీ వాసుల‌కు పండ‌గే!

రియాద్‌: మూడు దశాబ్దాల నిషేధం త‌రువాత సౌదీ అరేబియాలో తొలిసారిగా సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లు మొద‌లు కాబోతున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి ఆ దేశ‌వ్యాప్తంగా సినిమా థియేట‌ర్ల‌ను ప్రారంభించ‌బోతున్నారు. హాలీవుడ్ మూవీ బ్లాక్ పాంథ‌ర్‌తో అక్క‌డ సినిమాల ప్ర‌ద‌ర్శ‌న ఆట్ట‌హాసంగా ఆరంభం కాబోతోంది. దీనికోసం సౌదీ అరేబియా ప్ర‌భుత్వం ఇదివ‌ర‌కే ఆదేశాల‌ను జారీ చేసింది.

ఏఎంసీ అనే సంస్థకు సినిమా ప్రదర్శనకు సంబంధించిన లైసెన్స్ ఇచ్చింది. వ‌చ్చే అయిదేళ్ల‌లో సౌదీ అరేబియాలోని 15 ప్ర‌ధాన న‌గ‌రాల్లో 40 సినిమా థియేట‌ర్ల‌ను నిర్మిస్తుంది. 1970లో సౌదీ అరేబియాలో సినిమా హాళ్ల‌ను మూసివేశారు.

సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌ను నిషేధించారు. అప్ప‌టి నుంచి ఆ దేశంలో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న అనేదే లేదు. ప్ర‌స్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్ర‌జ‌ల అభిప్రాయాలు కూడా మారుతుండ‌టంతో సౌదీ ప్ర‌భుత్వం సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌ను పున‌రుద్ధ‌రించాల‌ని నిర్ణ‌యించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here