వివాదాల దుమారం రేపుతున్న సౌదీ అరేబియా యువ‌రాణి ఫొటో!

మీరు చూస్తున్న ఈ ఫొటో సౌదీ అరేబియా యువ‌రాణి హ‌య్ఫా బింట్ అబ్దుల్లా అల్‌-స‌వూద్‌ది. సౌదీ అరేబియా రాజు, దివంగ‌త అబ్దుల్లా కుమార్తె ఆమె. టాప్ లేని ఎర్ర‌రంగు కారులో స్టీరింగ్ ముందు ఠీవిగా కూర్చుని ఆమె దిగిన ఈ ఒక్క ఫొటో సౌదీ అరేబియాలో దుమారం రేపుతోంది. వివాదాల‌కు కేంద్ర‌బిందువైంది.

సౌదీ అరేబియాలోని జెడ్డా ప‌శ్చిమ ప్రాంతంలోని ఎడారిలో తీశారి పిక్‌. కార‌ణం- డ్రైవింగ్ చేస్తున్న విధంగా కూర్చోవ‌డ‌మే. చేతుల‌కు గ్లోవ్స్‌, కాళ్ల‌కు హైహీల్స్ వేసుకున్న ఈ ఫొటోను వోగ్ అరేబియా త‌న మేగ‌జైన్ క‌వ‌ర్‌పేజీలో ప్ర‌చురించింది. సౌదీ అరేబియాలో మ‌హిళ‌ల డ్రైవింగ్‌పై ఇప్ప‌టిదాకా కొన‌సాగిన నిషేధాన్ని ఎత్తేశార‌న‌డానికి నిద‌ర్శ‌నంగా ఈ ఫొటోను చెబుతున్నారు.

హ‌య్ఫా బింట్ అబ్దుల్లా ఇంట‌ర్వ్యూను వోగ్ అరేబియా మేగ‌జైన్ ప్ర‌చురించింది. త‌మ దేశంలో విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని, ఈ మార్పుల‌ను చూసి కొంద‌మంది మ‌త‌ఛాంద‌స వాదులు భ‌య‌ప‌డుతున్నార‌ని ఆమె ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

వ్య‌క్తిగ‌తంగా తాను ఈ మార్పుల‌ను స్వాగ‌తిస్తున్నాన‌ని అన్నారు. సౌదీ అరేబియాలో మ‌హిళ‌ల కారు డ్రైవింగ్‌పై ద‌శాబ్దాల కాలం నుంచీ అమ‌ల్లో ఉన్న నిషేధాన్ని ఈ నెల 24వ తేదీ నుంచి ఎత్తేయ‌నున్నారు. ఈ క‌వ‌ర్ పేజీ ఫొటోపై సౌదీ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here