సౌదీ అరేబియాలో ఘ‌రానా మోసం: ఉద్యోగినికి తెలియ‌కుండా 14 ఏళ్ల పాటు ఆమె జీతం స్వాహా

సౌదీ అరేబియాలో ఓ దారుణ మోసం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఓ ఉద్యోగినికి తెలియ‌కుండా ఆమె జీతాన్ని కాజేసింది ఓ పాఠ‌శాల యాజ‌మాన్యం. 14 సంవ‌త్స‌రాల త‌రువాత ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. సౌదీ అరేబియాలోని మ‌క్కాలో ఓ కిండ‌ర్‌గార్టెన్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బాధిత మ‌హిళ ఓ ఉపాధ్యాయిని.

 

22 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ఆమె మ‌క్కాలోని కిండ‌ర్‌గార్టెన్‌లో 1999లో టీచ‌ర్‌గా చేరారు. రెండేళ్ల‌పాటు ప‌ని చేశారు. ఆ త‌రువాత ఆమె మాస్ట‌ర్ డిగ్రీ చేయాల‌నే ఉద్దేశంతో 2001లో త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. మాస్ట‌ర్ డిగ్రీ పూర్తి చేసిన త‌రువాత ఆమె టీచ‌ర్ పోస్ట్ కోసం ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

 

ఆమె ద‌ర‌ఖాస్తును సౌదీ అరేబియా విద్యాశాఖ అధికారులు తిర‌స్క‌రించారు. ఎందుకంటే- ప్ర‌భుత్వ రికార్డుల ప్ర‌కారం ఆమె టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మ‌క్కాలోని కిండ‌ర్‌గార్టెన్‌లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తున్నందున.. ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రిస్తున్న‌ట్లు స‌మాధానం ఇచ్చారు అధికారులు. సంబంధిత కిండ‌ర్‌గార్టెన్ స్కూల్‌కు వేత‌నాన్ని చెల్లిస్తున్నామ‌ని అన్నారు.

దీనితో ఆమె దిమ్మ తిరిగింది. 14 సంవ‌త్సరాల కింద‌టే తాను మ‌క్కాలో ప‌నిచేసిన కిండ‌ర్‌గార్టెన్‌కు రాజీనామా ఇచ్చాన‌ని చెబుతున్నారు. తన పేరు, విద్యార్హ‌త‌ల‌ను వాడుకుని వేరే వ్య‌క్తి త‌న‌కు వ‌చ్చే జీతాన్ని వాడుకున్నార‌ని, దీనికి ప‌రిహారం చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని ఆమె ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here