వంటోడిని ఎగిరెగిరి త‌న్నిన సౌదీ అరేబియా యువ‌తి!

గొడ‌వ ఎక్క‌డ ఎందుకు వ‌చ్చిందో తెలియ‌ట్లేదు గానీ..ఓ యువ‌తి త‌న అక్క‌సును మొత్తం తీర్చుకున్నారు. ఓ వంటవాడిని ఎగిరెగిరి త‌న్నారు. క‌రాటె కిక్‌ల‌తో కుమ్మేశారు. రెస్టారెంట్ బ‌య‌టిదాకా త‌రిమారు. ఈ ఘ‌ట‌న సౌదీ అరేబియాలోని జెడ్డాలో చోటు చేసుకుంది.

జెడ్డాలోని అబు జెయిద్ డైన‌ర్ రెస్టారెంట్‌లో భోజ‌నానికి వ‌చ్చారామె. ఆ త‌రువాత గొడ‌వ ఎక్క‌డొచ్చిందో, ఎందుకొచ్చిందో తెలియ‌ట్లేదు. వంట‌వాడు కిచెన్ రూమ్ నుంచి బ‌య‌టికి రావ‌డం క‌నిపిస్తుంది. మొద‌ట ఆ వంట‌వాడిపై త‌న బూటును విసిరేయ‌డం, దాన్ని చూసిన అత‌ను కిందికి వంగి త‌ప్పించుకోవ‌డం క‌నిపిస్తుంది.

ఆ వెంట‌నే ఆమె క‌రాటె కిక్ ఇస్తూ ఎగిరెగిరి అత‌ణ్ణి త‌న్నింది. ఆ యువ‌కుడు కూడా ప్ర‌తిఘ‌టించ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అది స‌ఫ‌లం కాలేదు.

అత‌నికి స‌హాయంగా వ‌చ్చిన ఓ స‌ర్వెంట్‌కు ఆ యువ‌తి త‌న పంచ్ దెబ్బ‌ను రుచి చూపించారు. ఇద్ద‌ర్నీ కాలితో త‌న్నుతూ, రెస్టారెంట్ బ‌య‌టిదాకా త‌ర‌మ‌డం అక్క‌డ అమ‌ర్చిన సీసీ కెమెరాల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here