మక్కాలోకి వచ్చి చేతిలో కార్డులు పట్టుకుని.. ఆటలాడుతూ కూర్చున్న మహిళలు.. తీవ్ర వివాదం..!

పవిత్రమైన మక్కాకు వచ్చిన కొందరు మహిళలు ఓ వివాదానికి తెరతీశారు. ఏకంగా పవిత్ర మక్కా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం కొందరు మహిళలు కూర్చొని బోర్డు గేమ్ ఆడారు. సీక్వెన్స్ అనే ఆట ఆడుతూ నలుగురు మహిళలు కూర్చుండిపోయారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనకు సంబంధించి ఫోటోలు కూడా తీశారు. ఇంతలో ఎవరో ఫిర్యాదు చేయడంతో మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చారు. పవిత్ర ప్రదేశంలో ఇదేం పని అని వారికి చీవాట్లు పెట్టారు. మసీదు పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మీ పై లేదా అని నిలదీశారు. అయితే 2015 ఇలాంటి పని చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ పని మహిళల విషయంలో చేయలేదు వారికి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు.

మహిళలు చేసిన ఈ పిచ్చిపని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో సౌదీవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. తమ నిర్లక్ష్య వైఖరికి అక్కడి అధికారులు క్షమాపణలు చెప్పారు. సరిగ్గా శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో సీక్వెన్స్ అనే బోర్డు గేమ్ ఆడుతూ మహిళలు ఉండిపోయారు. విషయం తెలుసుకున్న మహిళా అధికారులు అక్కడికి చేరుకొని.. మసీదు లోపల ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పగానే వారు తమకు కో-ఆపరేట్ చేశారని.. వెంటనే ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయారని అధికారులు చెప్పారు. ఇకపై ఇలాంటి పనులు జరగకుండా చూసుకుంటామని అధికారులు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here