అందుకే ఆరోజు సావిత్రమ్మ.. ఇలా ఉంది..!

మహానటి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది. బరువెక్కిన హృదయాలతో అందరూ సినిమా నుండీ బయటకు వస్తున్నారు. జెమినీ గణేషన్ ను విపరీతంగా ప్రేమించడం వలనే సావిత్రమ్మకు ఈ కష్టాలు అని చెప్పుకున్నారు. తనకు విధించుకున్న శిక్ష.. అతి ప్రేమ కారణంగానే సావిత్రి చివరిదశలో అలా బ్రతికిందని చూపించారు.

ముఖ్యంగా ఓ సన్నివేశంలో సావిత్రిని జెమినీ గణేషన్ తిడతాడు. అది హైదరాబాద్ కు సావిత్రి-జెమినీ గణేషన్ ను ఆహ్వానించి.. వారిని అంబారీ మీద ఊరేగిస్తారు. ఎంతో చలాకీగా ఉండే సావిత్రి వెంటనే ఏనుగు మీదకు ఎక్కేస్తుంది. ఏనుగు మీద ఎక్కడానికి జెమినీ గణేషన్ జంకడంతో చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతారు.. ఏదో ఒకలా అంబారీ ఎక్కిన తర్వాత జెమినీ సావిత్రిని తిడతాడు. ఆ సన్నివేశంలో ఆమె ముఖం చిన్నబోవడం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇందుకు సంబంధించిన సాక్ష్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది.

సావిత్రి అంబారీ ఎక్కగా పక్కనే జెమినీ గణేషన్ కూర్చున్న ఫోటో ఇప్పుడు పలువురు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఆమెను సన్మానిస్తున్నప్పటికీ.. అంబారీ మీద ఊరేగుతున్నానన్న ఆనందం ఆమె మొఖంలో కనిపించడం లేదు. కావాలంటే మీరు కూడా చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here