మహానటి సినిమా క్లైమాక్స్ లో సావిత్రి వాయిస్ వినిపిస్తుందిగా.. ఆ మొత్తం ఇంటర్వ్యూ ఇదే..!

ప్రస్తుతం తెలుగు ప్రజలు ‘మహానటి’ మేనియాలో ఊగిపోతూ ఉన్నారు. సావిత్రి కథను ఇప్పటిదాకా మనకు ఎవరు కూడా ఇంతబాగా చెప్పలేదు.. చూపలేదు..! సినిమా విడుదలకు ముందు ఎన్నో అనుమానాలు ఉండేవి.. కానీ ఇంత బాగా సినిమా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఇక కీర్తి సురేష్ లో అయితే సావిత్రి పూనేసిందా అన్నట్లు ఉంటది సినిమాలో నటన. నాగ్ అశ్విన్ దర్శకత్వ తీరు అద్భుతమనే చెబుతున్నారు.

సినిమా పూర్తయ్యాక.. సావిత్రి మాట్లాడిన మాటలు వినిపిస్తాయి. ఆమె ఆల్ ఇండియా రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన మాటలు అవి..! ‘మళ్ళీ.. మళ్ళీ.. తరచూ మనం కలుసుకుంటాం.. మీ అందరినీ మరోసారి తప్పకుండా కలుసుకుంటాను..’ అని అన్న మాటలకు సంబంధించిన పూర్తీ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూ మీకోసం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here