నిర్మాత బండ్ల గణేష్ కు మరో షాక్..!

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు మరో షాక్ తగిలింది. గణేష్, అతని సోదరుడు శివబాబులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. కులం పేరుతో తమను దూషించినందుకు కృష్ణవేణి అనే కౌన్సిలర్ వారిపై కేసును వేసింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన డాక్టర్ దిలీప్ చంద్రకు ఫరూఖ్ నగర్ మండలం, బూర్గుల శివారులో పౌల్ట్రీ ఫామ్ లు, భూములు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు బండ్ల గణేష్ గతంలో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ ఆస్తులపై ఉన్న బ్యాంకు రుణాలను చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే, నిర్ణీత సమయంలోగా రుణాలను చెల్లించకపోవడంతో ఈ ఆస్తులను, దిలీప్ చంద్ర ఇంటిని బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. వేలం నిర్వహించి అమ్మేశారు.

తనకు రావాల్సిన డబ్బుల కోసం దిలీప్ చంద్ర, ఆయన భార్య, కౌన్సిలర్ కృష్ణవేణితో కలసి బూర్గుల శివారులో గల గణేష్ పౌల్ట్రీ ఫామ్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా తమను గణేష్, అతని సోదరుడు శివబాబు కులం పేరుతో దూషించారంటూ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజులుగా నిర్మాత బండ్ల గణేష్ పేరు వివాదాల్లో నానుతూ ఉంది. తాజాగా మరో కేసు అతడిపై నమోదయ్యింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here