ప్రియా వారియర్ కు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు..!

ప్రియా ప్రకాష్ వారియర్ మీద పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.. ముస్లింల మనోభావాలను కించపరిచే పాటలో నటించిందని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. దీనిపై ఆమె సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. దీనిని పరిశీలించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఆమెకు మద్దతుగా తీర్పును ఇచ్చింది. పోలీసు స్టేషన్లలో ప్రియా ప్రకాశ్ పై నమోదైన కేసులపై స్టే విధిస్తున్నట్టు ప్రకటించింది.

ఒరు అడార్ లవ్.. సినిమాలోని పాటలో ఆమె ప్రదర్శించిన హావభావాలకు ఎంతో మంది అభిమానులు తయారయ్యారు. సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఆమెకు వచ్చేశారు. అయితే ఏ పాట అయితే ఆమెను ఫేమస్ చేసిందో.. అదే పాట వలన ఆమె కోర్టు మెట్లు తొక్కాల్సి వచ్చింది. ఆమె ముస్లింల మనోభావాలను కించపరిచే పాటలో నటించిందని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.

ఈ కేసును నేడు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, తెలంగాణ, మహారాష్ట్ర సహా అన్ని పోలీసు స్టేషన్లలో ప్రియా ప్రకాశ్ పై నమోదైన కేసులపై స్టే విధిస్తున్నట్టు ప్రకటించింది. ఆమెపైనా, ఆ చిత్ర నిర్మాతలు, దర్శకుడిపై సినిమాకు సంబంధించి ఎటువంటి కేసులనూ నమోదు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఎక్కడా వారిపై కేసులు నమోదు చేయరాదని చెబుతూ, ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here