తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు..!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంటర్ బోర్డులు.. ఫలితాలు విడుదల చేయడానికి సమాయత్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ప్రయోగ, థియరీ, జనరల్, ఒకేషనల్ కోర్సులకు నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను రాజమహేంద్ర వరం నుంచి ఈ నెల 12న మధ్యాహ్నం విడుదల చేయనున్నారు. మొదటి సంవత్సర పరీక్ష ఫలితాలను విశాఖపట్నం నుంచి ఈ నెల 13 మధ్యాహ్నం విడుదల చేస్తామని తెలిపారు. ఈ పరీక్షల ఫలితాలను ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి బీ ఉదయలక్ష్మి సంయుక్తంగా విడుదల చేయనున్నారు.


తెలంగాణలో ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 13న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ 13న ఫలితాల విడుదల కుదరని పక్షంలో ఏప్రిల్ 15న ఫలితాలను విడుదలచేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 8నాటికే ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తవడంతో… ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు సమాయత్తమైంది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉన్నందున.. ఏప్రిల్ 15న ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డు భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here