ఆ న‌లుగురి కొంప‌ముంచిన హెయిర్ స్టైల్‌..ఎలాగంటే!

ఫొటోలో క‌నిపిస్తోన్న న‌లుగురూ విద్యార్థులే. ఒకే కాలేజ్‌, ఒకే క్లాస్ అన్న‌మాట‌. ఒకే మాట‌, ఒకే బాట‌, ఒకే స్టైల్ కూడా. ఇప్పుడా స్టైలే వారి కొంప‌ముంచింది. న‌లుగురినీ కాలేజీ నుంచి వెల్ల‌గొట్టేలా చేసింది. జుట్టు సాధార‌ణ స్థితికి చేరుకునేంత వ‌ర‌కూ కాలేజీలో కాళ్లు కూడా పెట్ట‌నివ్వ‌కుండా చేసింది.

ఇంగ్లండ్ యార్‌మౌత్‌లోని ప్రిస్టేజియ‌స్ గ్రేట్ యార్‌మౌత్ ఛార్ట‌ర్ అకాడ‌మీ అది. నిబంధ‌న‌లను అమ‌లు చేయ‌డంలో య‌మ స్ట్రిక్టు అక్క‌డి ప్రిన్సిపాల్‌. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఓ న‌లుగురు విద్యార్థులు డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌తో కాలేజీకి వ‌చ్చారు.

ఆ స్టైల్ పేరు `మీట్ మీ అట్ మెక్‌డొనాల్డ్స్` అట‌. ఈ హెయిర్‌స్టైల్‌తో అకాడ‌మీ క్యాంప‌స్‌లోకి అడుగు పెట్టేస‌రికి గ‌య్‌మంటూ లేచారు ప్రిన్సిపాల్ బ్యారీ స్మిత్‌. న‌లుగురినీ పిలిచి, అప్ప‌టిక‌ప్పుడు స‌స్పెండ్ చేశారు.

ఇలాంటి వాటిని తాము అస్స‌లు అనుమ‌తించ‌బోమ‌ని అంటూ న‌లుగురిపై వేటు వేశారు. ఓ నాలుగురోజులాగితే జుట్టు మామూలు స్థితికి వ‌స్తుంద‌ని విద్యార్థులు కాళ్లా, వేళ్లా ప‌డ్డా క‌నిక‌రించ‌లేదు. అది పెరిగిన‌ప్పుడే ర‌మ్మ‌ని ఆదేశాలు ఇచ్చారు. దీనితో వారు మొహాల‌ను వేలాడేసుకుని తిరుగుముఖం ప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here