రాత్రైతే చాలు దెయ్యం లాగా డ్రెస్ వేసుకొని వచ్చే లేడీ వార్డెన్.. గర్ల్స్ హాస్టల్ లో దూరడమే..!

రాత్రైతే చాలు ఆ వార్డెన్ దెయ్యం లాగా డ్రెస్ వేసుకునేది.. అయితే అలా డ్రెస్ వేసుకోవడం వలన చేసే పని ఏమిటో తెలిస్తే ఆమెను అసహ్యించుకుంటారు. దెయ్యం లాగా డ్రెస్ వేసుకునే వార్డెన్ గర్ల్స్ హాస్టల్ లోకి దూరేది. అక్కడ అమ్మాయిలను భయపెట్టి.. వారిని అసభ్యంగా తాకేది. చిన్న చిన్న పిల్లలకు ఎలా పడితే అలా తాకేది.. వల్ల బట్టలు కూడా విప్పించేది.

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఉన్న కస్తూర్భా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ స్కూల్ లో ఉన్న ఎనిమిది మంది అమ్మాయిలు జిల్లా మేజిస్ట్రేట్ కు లెటర్లు రాయడంతో అర్ధరాత్రి పూట వార్డెన్ చేసే అకృత్యాలు బయటకు వచ్చాయి. ఒక దెయ్యం ముఖం ఉన్న మాస్క్ ను వేసుకొని వస్తుందని.. తమను ఎక్కడ పడితే అక్కడ తాకుతుందని ఆ పిల్లలు పెన్సిల్ తో రాశారు. ఆ హాస్టల్ లో మొత్తం 100 మంది విద్యార్థినులు ఉంటారు. అలాగే ఇద్దరు టీచర్లు కూడా..!

తనతో పాటుగా ఒక స్ప్రే తీసుకొని వస్తుందని.. ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ప్రవర్తిస్తూ ఉంటుందని.. తాను అనుకున్న పిల్లల మీద ఆ స్ప్రే ను జల్లి ఏవేవో పనులు చేస్తుందని ఓ విద్యార్థిని చెప్పుకొచ్చింది. ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి విద్యార్థినుల నుండి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. కొన్ని కొన్ని సార్లు తాము పడుకుని ఉంటే వచ్చి ఏదేదో చేసేదని.. తమకు మెలుకువ వచ్చినా రానట్లు ప్రవర్తించక తప్పదని ఎనిమిదో తరగతి బాలిక తన లెటర్ లో రాసింది. ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం దీనిపై తాము ఎంక్వైరీ వేశామని ఓ ఉన్నతాధికారి మీడియాకు తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here