విద్యార్థినులతో పోలీసు వాహనాన్ని కడిగించారు.. ఎందుకో తెలుసా..?

ఇద్దరు విద్యార్థినులతో పోలీసు వాహనాన్ని కడిగించారు. ఇంతకూ ఎందుకు అని అనుకుంటారా.. వారిద్దరూ కోడిగుడ్లను తీసుకొని పోలీసు వాహనంపై విసిరారట..! దీంతో యార్క్ షైర్ కు చెందిన పోలీసులు వారికి పనిష్మెంట్ గా ఈ పని అప్పగించారు.

పోలీసు వాహనం అటుగా వెళుతుండగా ఈ ఇద్దరు అమ్మాయిలు దాని మీదకు కోడిగుడ్లను వేయడం మొదలుపెట్టారు. వెంటనే పోలీసులు వాహనాన్ని ఆపి.. నీటిగా శుభ్రం చేయమని చెప్పారు. ఈ విషయాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. వారు వాహనాన్ని కడుగుతున్న ఫోటోను పోస్ట్ చేసి.. పోలీసుల వాహనం మీదకు కోడిగుడ్లు వేస్తే ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయని స్పష్టం చేశారు.

దీనిపై సోషల్ మీడియాలో పలు కామెంట్లు వస్తున్నాయి. ఇది వారి జీవితంలో మరచిపోలేని గుణపాఠమని మరోసారి అలాంటి పనులు వారు చేయరు అని నెటిజన్లు చెబుతున్నారు. పోలీసులు చాలా మంచి పని చేశారని కూడా కామెంట్లు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here