అదే బౌల‌ర్‌..అదే బంతి! క్రీజ్‌లో కుప్ప‌కూలిన బ్యాట్స్‌మెన్‌!

ఫిల్ హ్యూస్‌. ఆస్ట్రేలియా ఓపెన‌ర్‌. దేశ‌వాళీ క్రికెట్ మ్యాచ్‌లో తోటి ప్లేయ‌ర్ షాన్ అబాట్ వేసిన బంతి త‌గిలి ప్రాణాలు వ‌దిలిన ఆట‌గాడు. అత‌ని స్మృతుల‌ను క్రికెట్ ప్ర‌పంచం అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేదు. తాజాగా- అలాంటి సంఘ‌ట‌నే చోటు చేసుకుంది.

ఈ ఘ‌ట‌న‌లో బ్యాట్స్‌మెన్ గాయ‌ప‌డ్డాడు. ప్రాణాల‌కేమీ ప్ర‌మాదం లేద‌ని తేల్చారు. విచిత్రం ఏమిటంటే- ఫిల్ హ్యూస్ బాల్ విసిరిన అబాట్ ఇక్క‌డ కూడా బౌల‌ర్ కావ‌డం. ఆస్ట్రేలియా దేశ‌వాళీ టోర్న‌మెంట్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

న్యూ సౌత్‌వేల్స్‌, విక్టోరియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్ సంద‌ర్భంగా అబాట్ వేసిన బంతి త‌ల‌కు త‌గిలి విక్టోరియా జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ పుకోవ్‌స్కీ అనే బ్యాట్స్‌మెన్ గాయ‌ప‌డ్డాడు. క్రీజ్‌లోనే కుప్ప‌కూలిపోయాడు.

అదృష్ట‌వ‌శావ‌త్తూ అత‌ని ప్రాణాల‌కేమీ కాలేదు. 130 కిలోమీట‌ర్ల వేగంతో బాల్ త‌ల‌కు త‌గ‌లింది. దీని దెబ్బ‌కు అత‌ను మోకాళ్ల మీద కూర్చుండిపోయాడు. తూలి ప‌డ‌బోగా అబాట్ స‌హా తోటి బ్యాట్స్‌మెన్లు ప‌ట్టుకున్నారు. వెంట‌నే వైద్య చికిత్స అందించారు. స్ట్రెచ‌ర్‌పై ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.

విక్టోరియా జ‌ట్టు రెండు వికెట్ల‌ను కోల్పోయి 64 ప‌రుగులు చేసిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అబాట్ వేసిన 18వ ఓవ‌ర్ నాలుగో బంతికి ఫుకోవ్‌స్కీ గాయ‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న త‌రువాత అబాట్ బంతిని ముట్టుకోవ‌డానికి భ‌య‌ప‌డ్డాడు.

చాలా సేపు నిర్వేదంగా ఉండిపోయాడు. ఫుకోవ్‌స్కీ స్థానంలో విక్టోరియా జ‌ట్టు కేప్టెన్ అరోన్ ఫించ్ బ్యాటింగ్‌కు దిగాడు. నేరుగా అబాట్ వ‌ద్ద‌కు వెళ్లి చాలాసేపు అత‌నితో మాట్లాడుతూ క‌నిపించాడు. ఆ ఓవ‌ర్‌లో మిగిలిన రెండు బంతుల‌ను వేయ‌డానికి అబాట్ చాలా స‌మ‌యం తీసుకున్నాడు.

https://twitter.com/nityagarfield/status/970192104365334528

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here