ఆమె పేరు ఆత్రేయీ మజుందార్.. 4వ తేదీ కెనెడా నుండి వచ్చింది..!

బెంగళూరు లోని బెల్లాందూర్ కు చెందిన అత్రేయీ మజుందార్ వారం రోజుల నుండి కనపడకుండా పోయింది. దీంతో ఆమె మిత్రులు గూగుల్ ను ఆశ్రయించారు. ఆమె వయసు 35సంవత్సరాలు. ఈనెల 4వ తేదీన కెనడా నుంచి వచ్చిన ఆమె, అదే రోజు రాత్రి 9 గంటల వరకూ ఇంట్లోనే ఉంది. ఆపై కనీసం హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకోకుండా బయటకు వెళ్లిన ఆత్రేయి ఇంటికి తిరిగి రాలేదు. తన ఫోన్ ను ఇంట్లోనే వదిలివెళ్లిన ఆత్రేయి, పాస్ పోర్టును, నగదును తీసుకుని ఇంటి నుంచి వెళ్లినట్టు తెలుస్తోంది.


35 సంవత్సరాల ఆంత్రోపాలజిస్ట్ ఏప్రిల్ 4 బుధవారం నుండి కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె టొరంటోలో పీహెచ్డీని చేస్తోంది. ఆమె బెలందూరులోని నోవాటెల్, మారియట్ హోటళ్ల సెక్యూరిటీ ఫుటేజ్ లో కనిపించినట్టు పోలీసులు తేల్చారు. నోవోటెల్ హోటల్ లో ఏప్రిల్ 4న ఆమె ఉంది.. ఏప్రిల్ 6న మారియట్ హోటల్ సీసీటీవీలో ఆమె చెక్ అవుట్ చేస్తున్నట్లు కనిపించింది.

ఆమె ఎక్కడుందన్న విషయాన్ని కనుగొనేందుకు స్నేహితులు, సహోద్యోగులూ గూగుల్ స్ప్రెడ్ షీట్ ను ఉపయోగిస్తున్నారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ లో విద్యను అభ్యసించిన ఆమె, ఆపై రీసెర్చ్ కోసం టొరంటోకు వెళ్లారు. ఆమె ఇంటి నుంచి వెళ్లిన ఓ రోజు తరువాత తాను న్యూఢిల్లీలో ఉన్నట్టు ఫోన్ చేసి చెప్పిందని, ఆ వెంటనే తాను బెంగళూరుకు వచ్చేయాలని చెప్పానని ఆత్రేయి తండ్రి వెల్లడించారు. ఇక ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేస్తూ, ఆమె ఎవరికి కనిపించినా తెలియజేయాలంటూ ప్రచారం చేస్తున్నారు.

ఆమె కుటుంబ సభ్యులు షేర్ చేసిన వివరాలు ఇలా ఉన్నాయి:
Dr Atreyee Majumder, Ph.D., (35) has been missing since she was seen last at the Marriott at Bellandur in Bengaluru on April 6. She is short (5 feet 0 inch) and thin, and speaks English, Hindi, and Bengali. If you see her, please call 9448290990 or 9845261515.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here