రాహుల్ గాంధీ మీద దూరం నుండి దండ వేసిన వ్యక్తిని పట్టుకోండి..!

గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ.. లీడర్లు కానీ ఓ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసుకుంటూ ఉన్నారు. అదేమిటంటే ఓ వ్యక్తి చాలా దూరం నుండి సరిగ్గా రాహుల్ మెడలో పూల మాల పడేలా వేశాడు. అది చాలా అద్భుతంగా అనిపించింది. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తిని పట్టుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని… ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అది పూల మాల కాబట్టి సరిపోయింది.. ఒకవేళ ఏదైనా వస్తువు అయి ఉండి.. అది వచ్చి రాహుల్ కు డైరెక్ట్ గా తగిలింటే అన్నదే ఇక్కడ పోలీసుల ప్రశ్న..?


కర్ణాటకలోని తుముకూరులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ పూలమాల సరిగ్గా వచ్చి రాహుల్ మెడలో పడడంతో భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే రాహుల్ గాంధీ మెడలో నుంచి పూలమాలను తీసివేసి… ప్రజలకు అభివాదం చేస్తూ, ముందుకు సాగారు. దీనిపై కర్ణాటక సెంట్రల్ రేంజ్ ఐజీ వి.దయానంద స్పందించారు. ఇది భద్రతా వైఫల్యాన్ని సూచిస్తోందని ఆయన అన్నారు. ఈ విషయం గురించి తనకు తెలియగానే, వెంటనే తుముకూరు ఎస్పీతో మాట్లాడానని, పూలమాల విసిరిన వ్యక్తిని గుర్తించాలని ఆదేశించానని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here