తన భార్యపై ఆ మాటలు అన్నందుకు శేఖర్ మాస్టర్ బాగా సీరియస్ అయ్యారు..!

కొద్ది నెలల క్రితం ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ ఇచ్చిన చాలా ఇంటర్వ్యూలలో శేఖర్ మాస్టర్ గురించి ప్రస్తావన తెచ్చేవారు. తాను శేఖర్ మాస్టర్ కు ఎంతగానో సహాయం చేశానని కానీ తనను అసలు పట్టించుకోలేదని.. చాలా తిట్టాడు రాకేశ్ మాస్టర్.. ఎప్పుడూ నవ్వుతూ ఉండే శేఖర్ మాస్టర్ అలాంటి వాడా అని చాలా మంది అనుకున్నారు. అప్పట్లో ఆ వీడియోలు బాగా వైరల్ కూడా అయ్యాయి. తన శవాన్ని చూడడానికి కూడా శేఖర్ మాస్టర్ రాకూడదని చెప్పారు రాకేశ్ మాస్టర్.. దీనిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శేఖర్ మాస్టర్.. గురువు కదా అండి.. పడతాం.. ఇంకేమి చేస్తాం చెప్పండి అని ఆ విషయం గురించి ఏమీ మాట్లాడలేదు.

అయితే తాజాగా శేఖర్ మాస్టర్ తన ఫేస్ బుక్ లైవ్ లో దీని గురించి స్పందించారు. రాకేశ్ మాస్టర్ చెప్పింది చాలా వరకూ అబద్దాలని స్పష్టం చేశారు. తనతో చాలా చెడుగా మాట్లాడాడని.. తల్లి గురించి కూడా ఎలా పడితే అలా మాట్లాడడంతోనే తాను ఫోన్ చేయవద్దని రాకేశ్ మాస్టర్ కు చెప్పేశానని అంతేకాని తాను ఆయన్ను ఏమీ అనలేదని చెప్పారు. ఎందుకు శేఖర్ మాస్టర్ తనతో మాట్లాడడం లేదో అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పారని శేఖర్ మాస్టర్ అన్నారు. తల్లి తర్వాతే ఎవరైనా అని.. తల్లిని అలా అన్నందుకే ఆయనతో మాట్లాడడం లేదని స్పష్టం చేశాడు.

ఇక తన భార్య గురించి కూడా చాలా చెడ్డగా చెప్పాడని శేఖర్ మాస్టర్ బాధపడ్డారు. తన భార్య రోడ్ల మీద ఎప్పుడైనా పునుగులు వేయడం చూశారా అని సీరియస్ గా ప్రశ్నించారు శేఖర్ మాస్టర్. కొన్ని కారణాల వలన ఫోన్ లో తన భార్య మాట్లాడలేదని.. దానికే ఆయన అపార్థం చేసుకున్నారని చెప్పాడు. చాలా చిన్న చిన్న విషయాలను ఆయన మనసులో పెట్టుకున్నారని శేఖర్ మాస్టర్ బాధపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here