నర్స్ అయి ఉండి ఇలాంటి చెత్తపనులు చేయొచ్చా..!

ఈ నర్స్ చేసిన పనుల గురించి తెలిస్తే.. ఇలాంటి వారు కూడా ఉంటారా అని మనకు అనిపించకమానదు. ఎందుకంటే ఆమె చేసిన పనులు అలాంటివి..! ఏనా కిమ్ అనే నర్స్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. అదేంటంటే ఆసుపత్రిలో ఐసీయులో ఉన్న వ్యక్తుల వద్ద ఫోటోలు తీసుకోవడం. వారికి ఆపరేషన్ చేస్తుండగా తీసుకుంది. శవాల దగ్గర కూడా సెల్ఫీలు తీసుకుంది. అక్కడితో ఆగకుండా ఆపరేషన్ జరుగుతుంటే వారి శరీరభాగాలను పట్టుకొని సేల్ఫీలు తీసుకుంది.

ఈ విషయం ఆమెతో పనిచేసే కొందరికి తెలుసు కూడా.. కానీ వారు దాన్ని పట్టించుకోలేదు. అయితే ఆమె ఆ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీనిపై పలువురు రిపోర్ట్ చేశారు.ఆమె వైద్య వృత్తికి కళంకం తీసుకొని వచ్చిందని. ప్రజలు బాధతో ఆసుపత్రికి వస్తే ఆమె చేసే పనులు ఇవా అని తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. దీంతో ఆమె చేసిన పనులపై విచారణకు ఆదేశించారు. ఏనాతో పాటూ కాజన్ అనే మరో నర్స్ కూడా అలాగే ఫోటోలు తీసుకుంది. అవయవాలతో ఫోటోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఏనా, కాజన్ లను విచారిస్తూ ఉన్నారు. వారు త్వరలో జైలుకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.. కానీ అలాంటివి ఏవీ పట్టించుకోకుండా నర్స్ లు ఇలా ప్రవర్తించడం నిజంగా బాధాకరమే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here