చంద్ర‌బాబు జూబ్లీహిల్స్ ఇంటి కోసం ఖ‌ర్చు పెట్టిన రూ.100 కోట్లు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో వెల్ల‌డించిన

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న పాత ఇంటిని ప‌డ‌గొట్టి, కొత్త‌గా క‌ట్టించిన విష‌యం రెండు తెలుగు రాష్ట్రాల వారికీ తెలిసిన విష‌య‌మే. ఈ ఇంటిని క‌ట్ట‌డానికి చంద్ర‌బాబు నాయుడు ఏకంగా 100 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు పెట్టార‌ని అప్ప‌ట్లో సోష‌ల్ మీడియా కోడై కూసింది. ఏటా వెల్ల‌డించే ఆస్తుల ప్ర‌క‌ట‌న‌ల్లో మాత్రం దాని విలువ పాతిక ల‌క్ష‌ల రూపాయ‌లుగానే చూపిస్తారు గానీ అది వేరే విష‌యం.

కొత్త భ‌వ‌నం క‌ట్ట‌డానికి 100 కోట్ల రూపాయ‌లు ఎక్క‌డివి? అనే అనుమానం అప్ప‌ట్లో అంద‌రికీ మెద‌ళ్ల‌ను తొలిచేసింది. చేతికి వాచీ, జేబులో ప‌ర్సు, హెరిటేజ్‌తో పెద్ద‌గా లాభాలు రావ‌ట్లేదు అని చెప్పుకొనే చంద్ర‌బాబు నాయుడు వంద కోట్ల రూపాయ‌ల‌ను ఖర్చు పెట్టి ఎలా ఇంత పెద్ద ఇంద్ర‌భ‌వ‌నాన్ని క‌ట్టించార‌ని ప్ర‌శ్నించుకున్నారు. వాటికి స‌మాధానాలు లేవు. ఈ ప్ర‌శ్న‌కు ఇప్పుడో ఆన్స‌ర్ దొరికింది. ఆ ఆన్స‌ర్ పేరు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు.

టీజీ వెంక‌టేష్ అని క‌ర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు. ఇప్పుడు రాజ్య‌స‌భ స‌భ్యుడు. ఉమ్మ‌డి రాష్ట్రంలో కిర‌ణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆయ‌న మంత్రి కూడా. 2014 ఎన్నిక‌లకు ముందు పార్టీ ఫిరాయించారు. టీడీపీలో చేరారు. అనూహ్యంగా రాజ్య‌స‌భ ఛాన్స్ కొట్టేశారు.

ఎంద‌రో పాత కాపులు ఉండ‌గా.. ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ ఫిరాయించి, టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన టీజీ వెంక‌టేష్‌కు రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఎందుకా? అని అనుకున్నారు. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం కోసం టీజీ వెంక‌టేష్.. చంద్ర‌బాబుకు 100 కోట్ల రూపాయ‌లు ఇచ్చార‌ట‌. ఆ డ‌బ్బుతోనే జూబ్లీహిల్స్‌లో చంద్ర‌బాబు ఇంద్ర‌భ‌వ‌నాన్ని క‌ట్టుకున్నార‌ని, దానికి తానే ప్ర‌త్య‌క్ష సాక్షిన‌ని చెబుతున్నారు మోత్కుప‌ల్లి. ఇదంతా- క్విడ్ ప్రో కో అన్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here