భారీ సెక్స్ రాకెట్‌: ఆ ముఠాలో ఇంతమంది ఉన్నారా? అంటూ పోలీసులు కూడా!

పాట్నా: భారీ సెక్స్ రాకెట్ అంటే.. భారీ సెక్స్ రాకెటే. సాధార‌ణంగా ఇలాంటి ముఠాల గుట్టు ర‌ట్ట‌యిన‌ప్పుడు ఆ గ్యాంగ్‌లో ఏ అయిదారుమందో, ఉంటారు మ‌హా అయితే ప‌దిమందికి మించ‌రు. బిహార్‌లోని క‌తిహార్‌లో దొరికిన వ్య‌భిచార ముఠాలో ఏకంగా 32 మంది స‌భ్యులు ఉన్నారు. పోలీసుల చేతికి చిక్క‌న‌వారి సంఖ్య ఇది.

మ‌రికొంద‌రు త‌ప్పించుకుని పారిపోయి ఉంటార‌ని భావిస్తున్నారు. క‌తిహార్‌లోని గులాబ్ బాగ్‌లో పెద్ద ఎత్తున వ్య‌భిచార కార్య‌క‌లాపాలు సాగుతున్న‌ట్టు ప‌క్కా స‌మాచారం అంద‌డంతో పూర్నియా పోలీసులు దాడి చేశారు. ఈ సంద‌ర్భంగా మొత్తం 32 మంది అమ్మాయిలు, డ‌జ‌నుకు పైగా విటుల‌ను అరెస్టు చేశారు.

గులాబ్ బాగ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఏడెనిమిది ఫ్లాట్ల‌ను అద్దెకు తీసుకుని ఈ త‌తంగాన్ని కొన‌సాగిస్తున్న‌ట్టు గుర్తించారు. అరెస్టు చేసిన వారిలో ఇద్ద‌రు మైన‌ర్ బాలిక‌లు కూడా ఉన్నారు. అమ్మాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చి వ‌దిలేశారు. నిర్వాహ‌కుల‌ను అరెస్టు చేశారు. కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here