శ్మశాన వాటికలో శవాల మధ్య నాట్యం చేసే వేశ్యలు.. చూడటానికి వచ్చే వందల మంది.. ఏంటా స్టోరీ..!

మన దేశంలో ఎన్నో వింత వింత ఆచారాలు ఇప్పటికీ పాటిస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలాంటి ఆచారమే.. శ్మశానవాటికలో శవాల మధ్య డ్యాన్స్ చేయడం. వినడానికి చాలా వింతగా అనిపిస్తున్నా కూడా ఇది చాలా ఏళ్ల నుండి జరుగుతోన్న ఆచారం అట. ఎక్కడో కాదండీ హిందువులకు అతి పవిత్రమైన వారణాసిలో ఇది ఇప్పటికీ అమలులోనే ఉంది.


ఇంతకూ ఆ స్టోరీ ఏంటనే కదా మీ డౌట్..

మణికర్ణిక ఘాట్ వద్ద వేశ్యలు వచ్చి నాట్యం చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాదు.. చైత్ర నవరాత్రి సప్తమి రోజు రాత్రి నుంచి తెల్లవారే వరకూ.. ఈ నృత్యాన్ని ‘తపస్యా’ అంటారు. ఆ రోజున వేశ్యలు ఘాట్ దగ్గరకు వచ్చి శంషాన్ బాబా(శ్మశాన బాబా) ముందు అన్నీ మరచిపోయి నృత్యం చేస్తారు. అది కూడా రాత్రి నుంచి తెల్లవారే వరకూ వేశ్యలు అవిరామంగా నృత్యాలు చేయడం విశేషం.

ఆ వేశ్యలు అలా నాట్యం చేయడం వెనుక ఓ కథ ఉంది. మణికర్ణిక ఘాట్ వద్ద పార్వతికి దూరమైన మహాశివుడు తాండవ నృత్యం చేశాడని ప్రతీతి. అంతేకాకుండా అక్బర్ నవరత్నాల్లో ఒకరిగా ప్రఖ్యాతి గాంచిన రాజా మన్ సింగ్….16వ శతాబ్దంలో ఈ ఘాట్ లో ఓ ఆలయాన్ని మహాశివుడికి అంకితం చేశారట. ఆ సందర్భంగా అక్కడ ఓ నృత్య విభావరిని ఏర్పాటు చేశారట. అయితే శవాల మధ్య నర్తించేందుకు ఎవరూ రాకపోవడంతో వేశ్యలు వచ్చి నాట్యం చేశారట. దీంతో ఆనాటి నుంచి ప్రతి చైత్ర నవరాత్రి సప్తమి రోజున వేశ్యలు అక్కడ నాట్యం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే వారు వేడుక కోసం నర్తించరట. జీవితంలో తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపం కోరుతూ మహా శంషాన్ బాబా ముందు నృత్యం చేస్తారు. దీన్ని చూడడానికి చాలా దూరం నుండి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. విదేశీయులు కూడా ఈ విషయం తెలుసుకొని ‘తపస్యా’ నృత్యం చేసేవాళ్ళను కలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here