సంచలన తీర్పును ఇచ్చిన బాంబే కోర్టు.. లవ్వర్స్ మధ్య శృంగారం.. రేప్ కానే కాదు..!

ఇద్దరు యువతీయువకుల మధ్య కొద్ది రోజుల పాటూ ఉన్న సంబంధం తర్వాత బెడిసికొట్టే అవకాశం ఉంది. అయితే తమను రేప్ చేశారని.. కొన్ని నెలలుగా లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా ఫిర్యాదులు చేయటం జరుగుతూ ఉంటుంది.. ఇలాంటి విషయంలో ముఖ్యంగా మగవాళ్ళు అడ్డంగా బుక్ అయిపోతున్నారు. ఇలాంటి ఒక కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.

ప్రేమించుకుని పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్న తర్వాత రేప్ కేసు పెడితే నిందితుడిని దోషిగా పరిగణించవద్దని పేర్కొంది. ఇద్దరూ ప్రేమించుకున్నట్టు ఆధారాలు ఉంటే ఆ సంబంధాన్ని అత్యాచారంగా పేర్కొనరాదని తేల్చి చెప్పింది. బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ ఈ కీలక తీర్పును వెల్లడించింది.

2013లో చెఫ్ యోగేష్ పాలేకర్ తనతోపాటు క్యాసినోలో పనిచేస్తున్న అమ్మాయిని ప్రేమించాడు. కుటుంబ సభ్యులకు పరిచయం చేసేందుకు ఆమెను ఓ రోజు ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రి ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా పలుమార్లు వారు ఈ సంబంధాన్ని కొనసాగించారు. అయితే తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమెను పెళ్లాడేందుకు యోగేష్ నిరాకరించాడు. దీంతో ఆమె యోగేష్‌పై రేప్ కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రేప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు యోగేష్‌ను దోషిగా తేల్చి ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన బాంబే హైకోర్టులోని గోవా బెంచ్ ట్రయల్ కోర్టు తీర్పును తప్పుబట్టింది. వారిద్దరూ ప్రేమించుకున్నట్టు బలమైన ఆధారాలు ఉన్నప్పుడు అతడిని దోషిగా పేర్కొనడం సరికాదని తీర్పును ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here