నాతో పాటూ.. నా రూమ్ లో ఇంకో ఇద్దరు మగవాళ్ళు కూడా ఉండేవారన్న షాలినీ పాండే..!

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే.. తన యాక్టింగ్ తోనే కాకుండా తన ఫ్లాష్ బ్యాక్ తో కూడా మన అందరి మనసులనూ దోచేసుకుంది. తాను సినిమాల్లోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డానని.. కనీసం తన తండ్రి కూడా సపోర్ట్ చేయలేదని.. ఇంట్లో నుండి బయటకు వెళ్ళమన్నాడని చెప్పి ఓ టీవీ షోలో అందరినీ కళ్ళు చెమర్చేలా చేసింది.

అయితే మగవాళ్ళు అందరూ ఒకేలా ఉండరని.. మంచి వాళ్ళు కూడా ఉంటారని ఓ ఉదాహరణ అది కూడా తన జీవితంలో జరిగింది బయటపెట్టింది ఈ అర్జున్ రెడ్డి లవర్. అదేమిటంటే తాను ఇంటి నుండి బయటకు వచ్చాక తాను ఇద్దరు మగవాళ్ళతో కలిసి రూమ్ షేర్ చేసుకున్నానని కానీ వారు ఎప్పుడూ తనను వేరే ఉద్దేశ్యంతో చూడలేదని చెప్పింది. ముంబయిలో తన స్నేహితురాళ్ళతో కలిసి ఉండే అవకాశం లేకపోవడంతో ఇద్దరు అబ్బాయిలున్న రూంలో అడ్జస్ట్ కావాల్సి వచ్చిందట..! ఆ ఇద్దరూ తనను జాగ్రత్తగా చూసుకున్నారు తప్పితే.. ఎప్పుడూ తనతో అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పింది షాలిని పాండే. వాళ్ల వల్లే తాను ప్రపంచాన్ని కొత్తగా చూడటం అలవాటు చేసుకున్నానని షాలిని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here