భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ.. మరీ ఇంత నీచుడా.. భార్య బయటపెట్టిన అతడి రాసలీలలు..!

భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ బండారం మొత్తం అతడి భార్య బయట పెట్టేసింది. చాలా మంది యువతులతో తన భర్తకు పరిచయాలు ఉన్నాయని.. తన భర్త చేసిన ఛాటింగ్ లకు సంబంధించిన స్క్రీన్ షాట్ లను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అందరినీ షాక్ కు గురిచేసింది.

 

ఎక్కడెక్కడో ఉన్న మహిళలతో తన భర్తకు పరిచయాలు ఉన్నాయని ఆమె వాపోయింది. మొదట షామీ భార్య జహాన్ ప్రొఫైల్ ను ఎవరో హ్యాక్ చేశారని అనుకున్నారు. అయితే అవన్నీ నిజమేనని ఆమె స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఒప్పేసుకుంది. బీఎండబ్ల్యూ కార్ లో ఉండగా తనకు షమీ ఫోన్ దొరికిందని.. ఆ ఫోన్ కు ఉన్న లాక్ ను తాను పలు మార్లు  ప్రయత్నించిన తర్వాత ఓపెన్ అయిందని జహాన్ చెప్పుకొచ్చింది. తన భర్త చాట్ లను ఓపెన్ చేయగా.. అతడి రాసలీలను మొత్తం బయటపడ్డాయని చెప్పుకొచ్చింది.

తాను ఈ ఘటనపై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నానని ఆమె చెప్పుకొచ్చింది. గత రెండేళ్ళుగా షమీ, అతడి కుటుంబం తనను టార్చర్ చేస్తోందని చెప్పుకొచ్చింది. షమీ కుటుంబ సభ్యులు తనను ఎప్పుడూ తిడుతుండేవారని.. చాలా రోజులు తాను ఓపిక పట్టానని భర్త మరీ ఇలాంటి వాడని తెలిస్తే ఎలా అని ఎదురు ప్రశ్నించింది. అంతే కాకుండా తనను తెల్లవారు జామున 2-3గంటల వరకూ టార్చర్ పెట్టేవాళ్ళని.. చంపడానికి కూడా ప్రయత్నించారని ఆమె చెప్పింది. తాను బయటపెట్టింది చాలా తక్కువ సాక్ష్యాలని.. ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకొచ్చింది.

https://twitter.com/hemant10/status/971093915544666114

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here