షమీ భార్యకు కోపం ముంచుకొచ్చింది.. కెమెరాలను పగులగొట్టి వెళ్ళిపోయింది..!

భారత క్రికెటర్ షమీ భార్య హసీన్ జహాన్.. గత కొద్ది రోజులుగా షమీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. అతడికి వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని.. తన దగ్గర పలు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పుకోస్తూ ఉంది. అయితే ఈరోజు ఎందుకో ఆమె ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తోంది. ఏకంగా మీడియా మీదకే దాడికి పాల్పడింది.

కోల్‌కతా నగరంలోని సెయింట్ సెబాస్టియన్స్ స్కూల్ ఆవరణలో జర్నలిస్టులు ఆమెను సంప్రదించాలని అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ వెంటనే కెమెరాను పగులగొట్టి వెళ్ళిపోయింది. మీడియాను తిడుతూ.. గట్టిగా కేకలు వేస్తూ కారులో అక్కడి నుండి వెళ్లిపోయింది. తనకు మద్దతిస్తున్న అభిమానులకు షమీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. భార్య ఫిర్యాదు మేరకు అతనిపై ఈ నెల 9న హత్యాయత్నం, గృహ హింస కేసులు నమోదయ్యాయి. షమీకి భారత్ మాజీ కెప్టెన్ ధోనీ కూడా మద్దతు నిలిచిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ విషయం చర్చనీయంశమవుతోంది. ఆమె ఇన్ని రోజులూ మీడియాతో మంచిగా మాట్లాడి.. ఇవాళ ఎందుకు అలా ప్రవర్తించిందో అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here