కర్ణాటక ఎమ్మెల్యేలను తరలించడానికి ‘శర్మ’ బస్సులే ఎందుకు.. ఇంతకూ అందులో స్పెషాలిటీ ఏమిటి..!

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం రోజుకో హైడ్రామా జరుగుతోంది. 15 రోజులు గడువు ఇచ్చి ఆ రాష్ట్ర గవర్నర్ బేరసారాలకు తెరలేపారని ప్రతి ఒక్కరూ మాట్లాడుకోసాగారు. ఇక సుప్రీంకోర్టులో కాంగ్రెస్ వేసిన పిటీషన్ ప్రకారం.. కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చి శనివారం సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోమని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్ లో ఉంటున్నారు.

వీరిని తీసుకొని వెళ్ళిన శర్మ ట్రావెల్స్ గురించి ప్రత్యేకంగా చర్చిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ బస్సుల్లోనే తరలిస్తున్నారు.. ఈ బస్సుల్లో ఏమన్నా స్పెషాలిటీ ఉందా అని..! స్పెషాలిటీ బస్సుల్లో లేదట.. ఈ బస్సు ఓనర్ లో ఉందట. ఎందుకంటే ఈ బస్సులకు ఓనర్ డీపీ శర్మ.. ఆయన కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడు. వేరే సంస్థల ఓనర్లు అయితే ఎమ్మెల్యేల రూటు మార్చే అవకాశం ఉందేమోనాన్నా అనుమానంతో‘శర్మ’ బస్సులనే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వినియోగిస్తోంది. డీపీ శర్మ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని, విశ్వాసపాత్రుడైన ఆయన 1980 లలో రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేశారు. 1998లో దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత ఆయన బస్సుల రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ఆయన 2001లో మృతి చెందగా ఆ తర్వాత ఈ సంస్థ బాధ్యతలను ఆయన కుమారుడు సునీల్ కుమార్ శర్మ చేపట్టారు. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో అభిమానం కనబర్చేవాడు. ఈ సంస్థకు చెందిన లగ్జరీ బస్సులు బెంగళూరు నుంచి పలు ప్రాంతాలకు నడుపుతున్నారు. అందుకే ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలను తరలించడానికి వీళ్ళ బస్సులనే వాడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here