అదిగ‌దిగో `ష‌వ్వ‌ల్ చాంద్‌`

అమావాస్యకు మ‌రుస‌టి రోజు నెల‌వంక క‌నిపించ‌గానే ముస్లిం సోద‌రులు రంజాన్ పండుగ‌ను భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకొంటారు. నెల‌వంక క‌నిపించ‌క‌పోతే.. పండుగ‌ను మ‌రుస‌టి రోజుకు వాయిదా వేసుకుంటారు. రంజాన్ చంద్రుడిని `ష‌వ్వ‌ల్ చాంద్‌`గా పిలుచుకుంటారు.

ష‌వ్వ‌ల్ చాంద్ గురువారం నాడే క‌నిపించిన‌ట్లు యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించిన ఫొటోను ఆ దేశ ఆస్ట్రాన‌మీ సెంట‌ర్ విడుద‌ల చేసింది. దీనితో గ‌ల్ఫ్ దేశాల్లో శుక్ర‌వారం నాడే రంజాన్ పండుగ‌ను నిర్వ‌హించడం ఖాయ‌మైంది. మ‌న‌దేశంలో ష‌వ్వ‌ల్ చాంద్ ఇంకా క‌నిపించ‌క‌పోవ‌డంతో రంజాన్ పండుగ‌ను శ‌నివారం నిర్వ‌హించ‌బోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here