ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీష‌న్ అనుకుంటే పొర‌పాటే: ముఖం మీద ద‌ట్టంగా వెంట్రుక‌లు!

ఈ ఫొటోలో ఉన్న బాలిక‌ను చూస్తే.. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటిష‌న్‌లో పాల్గొంటున్న‌ట్టు అనిపించ‌వ‌చ్చు. అలా అనిపిస్తే పొర‌పాటే. ఎందుకంటే.. ఆ పాప శ‌రీర‌మే అంత‌. ఆ బాలిక ముఖం నిండా ఇలా వెంట్రుక‌లు మొలిచాయి.

దీనికి కార‌ణం.. ఆంబ్రెస్సీ సిండ్రోమ్ అనే ఓ వ్యాధి. కోటి మందిలో ఒక‌రికి కూడా ఈ వ్యాధి సోక‌దు. అలాంటి అరుదైన అంబ్రెస్సీ సిండ్రోమ్ బారిన ప‌డిందా బాలిక‌. ఆమె పేరు సుపాత్రా సుసుఫాన్‌. ఉండేది బ్యాంకాక్‌లో.

ఇలా ముఖం నిండా వెంట్రుక‌లు రావ‌డం వ‌ల్ల ఆ బాలిక ఎంత మాత్రం కుంగిపోలేదు. పైగా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తోంది. దీనికీ ఓ కార‌ణం ఉంది. అత్య‌ధిక వెంట్రుక‌లు ఉన్న మ‌హిళ‌గా గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించింది.

త‌నంటే ఇష్ట‌ప‌డేవాళ్లు కూడా చాలామందే ఉన్నార‌ని చెబుతోంది సుపాత్రా. స్కూల్‌లో, ఇంటా, బ‌య‌టా త‌న‌కు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నార‌ని, సోష‌ల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాన‌నీ, త‌న‌కు ఫాలోయ‌ర్లు చాలామంది ఉన్నార‌ని అంటోంది.

ఈ ప్ర‌త్యేక‌త అంతా.. ఈ వెంట్రుక‌ల వ‌ల్లే సాధ్య‌మైంద‌నీ చెబుతోంది. ఇప్పుడు పెళ్లీడుకొచ్చింద‌ని, తానంటే ఇష్ట‌ప‌డే యువ‌కుడిని పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు కొద్దిరోజుల కింద‌టే ప్ర‌క‌టించిందామె.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here