ఆయ‌నెవ‌రో తెలియ‌క ఫొటో తీయ‌మ‌న్నారు..తెలిసిన త‌రువాత నోరెళ్ల‌బెట్టారు!

ఈ ఫొటోలో ఓ అంద‌మైన జంట‌కు మొబైల్ ద్వారా ఫొటో క్లిక్ మ‌నిపిస్తున్నాడో యువ‌కుడు. చిరున‌వ్వుతో ఫోజిచ్చారా క‌పుల్. ఎవ‌రో దారిన పోయే దాన‌య్య క‌దా! అనుకుని.. ఆయ‌న చేతికి మొబైల్ ఇచ్చి.. ఫొటో తీయ‌మ‌న్నారు.

వాళ్లు అడిగిన వెంట‌నే కాద‌న‌లేక‌పోయారు. వారిచ్చిన మొబైల్ తీసుకుని క్లిక్ మ‌నిపించాడు. నాలుగైదు యాంగిల్స్‌లో ఫొటోలు తీశారు. వారి మొబైల్‌ను చేతిలో పెట్టి వెళ్లిపోయారు. ఆ త‌రువాత తెలిసింది ఆయ‌నెవ‌రో.

ఆయ‌నెవ‌రో కాదు.. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ఉపాధ్య‌క్షుడు, ప్ర‌ధాన‌మంత్రి, దుబాయ్ రూల‌ర్ షేక్ మొహ‌మ్మ‌ద్ బిన్ ర‌షీద్ అల్ మ‌ఖ్తౌమ్ కుమారుడు, క్రౌన్ ప్రిన్స్‌ హ‌మ్‌దన్ బిన్ మొహ‌మ్మ‌ద్ అల్ మ‌ఖ్తౌమ్.

కొద్దిరోజుల కిందట ఆయ‌న వ్యక్తిగ‌తంగా న్యూజీలాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. అక్లాండ్ స‌మీపంలో ఉన్న ఓ జాతీయ పార్క్‌ను సంద‌ర్శిస్తున్న స‌మ‌యంలో.. అదే దేశానికి చెందిన ఓ యువ‌తీ, యువ‌కుడు త‌మ‌ను ఫొటో తీయాలని కోరారు.

త‌మ మొబైల్‌ను ఆయ‌న చేతిలో పెట్టారు. వారి మాట‌ను కాద‌న‌లేక‌పోయారు హ‌మ్‌ద‌న్‌. నాలుగైదు యాంగిల్స్‌లో ఫొటోలు తీశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న సాక్షాత్తూ యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ క్రౌన్ ప్రిన్స్ అనే విష‌యం వారికి తెలియ‌దు. తెలిసిన త‌రువాత నోరెళ్ల‌బెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here