సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఎక్కడ కూడా సౌత్ ఆఫ్రికాకు అవకాశం ఇవ్వకుండా భారత్ 270 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. విరాట్ కోహ్లీ, రహానేల భాగస్వామ్యం భారత్ ను గెలుపుబాట పట్టించింది. అయితే విరాట్ చేసిన తప్పిదం వలన బాగా ఆడుతున్న శిఖర్ ధావన్ రన్ అవుట్ అయ్యాడు. లేని పరుగు కోసం ప్రయత్నించిన కోహ్లీ అనవసరంగా ధావన్ అవుట్ అయ్యేలా చేశాడు. దీంతో మైదానంలోనే ధావన్ ఆ కోపాన్ని బయటపెట్టాడు.
మ్యాచ్ లో ఈ ఘటన 12.2 ఓవర్ లో చోటుచేసుకుంది. మోరిస్ వేసిన బంతి ధావన్ ఇన్ సైడ్ ఎడ్జ్ అయింది. దీంతో సౌత్ ఆఫ్రికా ఆటగాళ్ళు అప్పీల్ చేశారు. ధావన్ రన్ తీయడానికి రెడీగా లేడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం రన్ కోసం సగం ముందుకు వచ్చేశాడు. దీంతో ధావన్ రన్ కోసం పరిగెత్తాల్సి వచ్చింది. ధావన్ రన్ పరిగెత్తగా మాకరమ్ బంతిని తీసుకొని డైరెక్ట్ త్రో వేశాడు. అంతే ధావన్ నాన్ స్ట్రైక్ ఎండ్ చేరుకోకముందే వికెట్లకు బంతి పడింది. క్రీజుకు చాలా దూరంగా ఉన్న ధావన్ రన్ అవుట్ అయ్యాడు.
రన్ తీయడానికి ఏ మాత్రం రెడీగా లేని ధావన్ అవుట్ అవ్వగానే తన కోపాన్ని గ్రౌండ్ లో ప్రదర్శించాడు. గట్టిగా అరిచేశాడు కూడా..! విరాట్ కోహ్లీ వైపు తిరిగి ఎందుకు రన్ వచ్చావు.. అవసరమా అన్నట్లు సిగ్నల్ కూడా ఇచ్చేసి వచ్చేశాడు. ధావన్ 29 బంతుల్లో 35పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఈ వికెట్ భారత్ విజయంపై ప్రభావం చూపలేదు. కోహ్లీ శతకం బాది భారత్ కు విజయాన్ని అందించాడు.
Why Kohli why?! pic.twitter.com/DooQE6VeE1
— Cricket Videos (@cricvideos5) February 1, 2018