శిఖర్ ధావన్.. ఫ్లైట్ లో కూడా సందడే సందడి..!

ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమి అనేదే లేకుండా దూసుకుపోతోంది. ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతంగా రాణిస్తూ తిరురులేని జట్టుగా మారింది. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ విజయాలే అందుకుంది. ప్రతి ఒక్క ఆటగాడు కూడా సన్ రైజర్స్ విజయంలో పాలు పంచుకుంటూ ఉన్నాడు. ఆ ఆటగాళ్ళలో శిఖర్ ధావన్ కూడా ఒకరు.

శిఖర్ ధావన్ మొదటి రెండు మ్యాచ్ లలో కూడా అద్భుతంగా ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ తో 78పరుగులు చేసి.. విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక మైదానంలోనే కాదు బయట కూడా ధావన్ ఎంతో ఆనందంగా ఉంటాడు. కొంటె పనులతో ఎప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటాడు.. తన జట్టు సభ్యులను. తాజాగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానంలో తన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యులను ధావన్ ఆటపట్టించాడు.

మొదట షకీబ్ అల్ హసన్ తో ధావన్ ఆడుకోవడాన్ని మొదలుపెట్టాడు. షకీబ్ నిద్రపోతూ ఉండగా ఓ పేపర్ ను అతడి ముక్కులో పెట్టాడు. తన ముక్కులో ఏదో ఉంది అని షకీబ్ నిద్ర నుండి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్ ను కూడా అలాగే ఆడుకున్నాడు. ఇలా విమాన ప్రయాణంలో ధావన్ అందరితోనూ ఎంతో జాలీగా గడిపేశాడు. అందుకు సంబంధించిన వీడియో మీరే చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here