హార్ట్ అటాక్ తో చనిపోయిన అడుక్కునే మహిళ.. ఆమె అకౌంట్ లో చూడగా..!

బ్రతికున్నప్పుడంతా ఆ అడుక్కునే మహిళకు ఎవరైతే డబ్బులు దానం చేశారో ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ చూశాక ముక్కున వేలేసుకున్నారు. వీళ్ళు దానం చేసిన వాళ్ళ ఆస్థి కంటే ఆమె దగ్గరే చాలా రెట్లు ఎక్కువ బ్యాంకు ఖాతాలో మగ్గుతోందట. ఈ ఘటన లెబనీస్ రాజధాని బీరట్ లో చోటుచేసుకుంది.

ఫాతిమా ఓటమన్ అనే మహిళ ఇటీవలే హార్ట్ అటాక్ తో మరణించింది. ఆమె దగ్గర ఉన్న బ్యాగులలో చూడగా ఏకంగా 5 మిలియన్ల లెబనీస్ కరెన్సీ బయటపడింది. ఇక ఆమె అకౌంట్ లో ఎంత డబ్బు ఉంది అని చూడగా పోలీసులు కూడా షాక్ తిన్నారు. ఏకంగా 9 కోట్ల రూపాయల పైనే ఆమె అకౌంట్ లో ఉంది. ఆమె మరణంపై ఎటువంటి అనుమానాలు లేవని పోలీసులు చెప్పారు. ఆమె హార్ట్ అటాక్ తోనే చనిపోయిందని స్పష్టం చేశారు.

ఆమె దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంటుందని అనుకున్నామని.. కానీ ఆమె బ్యాంక్ పాస్ బుక్ తమకు దొరకడం.. అందులో భారీ మొత్తంలో డబ్బు ఉండడం నిజంగా షాకింగ్ గా ఉందని పోలీసు అధికారి తెలిపారు. ఇక ఎప్పుడూ ఆమె డబ్బులు, తిండి దానం చేసే స్థానికులు కూడా విషయం తెలుసుకొని షాక్ తిన్నారు. ఇక ఆమె బంధువులను వెతికి వారికి ఆమె మృతదేహాన్ని అప్పగించారు. వారు కూడా ఆమె అంత సంపాదించిందా అని అవాక్కయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here