జ్వరం వచ్చిన 11ఏళ్ల కొడుకుకి యాపిల్ ఇచ్చిన తల్లిదండ్రులు.. అదే అతడి ప్రాణాలు తీసింది..!

జ్వరం వచ్చిన కొడుకుకి తల్లిదండ్రులు ఓ యాపిల్ ఇచ్చారు. కానీ అదే అతడి ప్రాణాలు తీస్తుందని వారు అసలు ఊహించి ఉండరు. యాపిల్ తిన్న క్షణాల్లోనే కొడుకు ప్రాణం పోయింది.

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం చిక్ బళాపురలో చోటుచేసుకుంది. ఆరవ తరగతి విద్యార్థి అయిన 11ఏళ్ల ఆసిఫ్ గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. అతడికి తల్లిదండ్రులు యాపిల్ ను తినడానికి ఇచ్చారు. యాపిల్ తింటుండగా ఆసిఫ్ కు శ్వాస ఇబ్బందులు వచ్చాయి. దీంతో వెంటనే తల్లిదండ్రులు అతన్ని తీసుకొని ఆసుపత్రికి బయలుదేరారు. అయితే దారిలోనే ఆ పిల్లాడు ప్రాణాలు వదిలాడు.

ఆ పిల్లాడికి పోస్టుమార్టం నిర్వహించగా ఓ చిన్న యాపిల్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. వాయు నాళం లోకి యాపిల్ ముక్క ఇరుక్కుపోవడంతో అతడికి గాలి ఆడలేదు.. దీంతో క్షణాల్లో ఆసిఫ్ చనిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here